- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Voters: ఒకే ఈపీఐసీ నంబర్ ఉంటే వారంతా నకిలీ ఓటర్లు కాదు.. ఈసీ కీలక ప్రకటన
రెండు వేర్వేరు రాష్ట్రాల్లోని ఓటర్లకు ఒకే తరహా ఓటర్ ఐడీ నంబర్లు జారీ చేశారని పలు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈసీ స్పందించింది.

దిశ, నేషనల్ బ్యూరో: రెండు వేర్వేరు రాష్ట్రాల్లోని ఓటర్లకు ఒకే తరహా ఓటర్ ఐడీ నంబర్లు జారీ చేశారని పలు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(EC) స్పందించింది. ఒకే నంబర్ కలిగి ఉన్న ఓటర్లు నకిలీ ఓటర్లు కాదని స్పష్టం చేసింది. కొంత మంది ఓటర్లకు ఒకే రకమైన ఎలక్టర్ ఫోటో ఐడెంటీ కార్డు (EPIC) నంబర్లను కలిగి ఉండొచ్చని, కానీ జనాభా డీటెయిల్స్, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ సహా ఇతర వివరాలు భిన్నంగా ఉంటాయని తెలిపింది. ఈపీఐసీ నంబర్‌తో సంబంధం లేకుండా ఒక ఓటరు తన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని తనకు కేటాయించిన నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్‌లో మాత్రమే ఓటు వేయగలడని పేర్కొంది. ఈ పోలింగ్ బూత్‌లో కాకుండా మరెక్కడా ఓటు వేయలేదని వెల్లడించింది.
ఒకే ఈపీఐసీ నంబర్ ఉన్నా ఓటర్ వేరే రాష్ట్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోలేడని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల ఓటర్ల డేటాబేస్‌ను ఎలక్టోరల్ రోల్ మేనేజ్‌మెంట్(ERONET) ప్లాట్ ఫామ్‌లో అప్ లోడ్ చేయడానికి ముందు మ్యానువల్ ప్రక్రియను అనుసరిస్తామని, దీని కారణంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఓటర్లకు ఓకే ఈపీఐసీ నంబర్ కేటాయించామని తెలిపింది. దీంతో కొంతమంది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు వివిధ రాష్ట్రాల్లోని వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఒకే సంఖ్యలను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
అయితే ఈ ఆందోళనలను పరిష్కరిస్తామని ఓటర్లకు ప్రత్యేకమైన నంబర్లను కేటాయించేలా చూస్తామని తెలిపింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ERONET 2.0 ప్లాట్‌ఫామ్‌ను కూడా అప్ డేట్ చేస్తామని వెల్లడించింది. కాగా, వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చడానికి బీజేపీ ఎన్నికల సంఘంతో కుమ్మక్కైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈసీ క్లారిటీ ఇచ్చింది.






