బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. మెజారిటీ స్థానాల్లో BNP ముందంజ

by Kema Shiva Kumar |

బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. మెజారిటీ స్థానాల్లో BNP ముందంజ
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత దేశంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 299 నియోజకవర్గాల్లో ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా, కట్టడిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని ‘అవామీ లీగ్’ పోటీలో లేకపోవడంతో ప్రధానంగా తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది.

47.91 ఓటింగ్ శాతం నమోదు..

ఈ ఎన్నికలతో పాటు ‘జులై చార్టర్’పై కూడా ప్రజలు ఓటు వేశారు. ఇది ఆమోదం పొందితే కాబోయే ప్రభుత్వం రాజ్యాంగంలో భారీ మార్పులు చేసే అధికారం పొందుతుంది. ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి పదవికి రెండు పర్యాయాల పరిమితి, ద్విసభ పార్లమెంట్ వంటి సంస్కరణలు ఉన్నాయి. అక్కడక్కడా చెదురుమొదురు హింస, రిగ్గింగ్ ఆరోపణలు వచ్చినప్పటికీ, ఓటింగ్ శాతం సుమారు 47.91 శాతం నమోదైనట్లు తెలుస్తోంది. 299 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం మేరకు మెజారిటీ స్థానాల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫలితాలు, స్పష్టమైన ఆధిక్యం ఫిబ్రవరి 13 రేపు మధ్యాహ్నానికి వెలువడే అవకాశం ఉంది.

Next Story