కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల కొనుగోలు.. వీడియో వైరల్

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల కొనుగోలు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ప్రచారం అలా ముగిసిందో లేదో డబ్బులు పంచుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇన్ని రోజులు ప్రచారంతో హోరెత్తించిన ఇప్పుడు ఓట్ల కొనుగోలు కార్యక్రమం చేపట్టాయి. ఓటర్లకు డబ్బులు పంచుతూ తమ అభ్యర్థులకే ఓట్లు వేయాలని కోరుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో నాయకులు వాళ్లనే టార్గెట్ చేశారు. ప్రచారం మొదలు, ఓటు రాబట్టుకునే వరకు డబ్బుల పర్వానికి తెరతీశారు. ఇళ్ల దగ్గర చిట్టీలు ఇవ్వడం.

వేరే ప్రాంతంలోకి డబ్బులు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ డబ్బులు పెద్ద నేతలే డైరెక్ట్‌గా పంచుడుకు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలోని చామ్‌రాజ్‌పేట LACలో కాంగ్రెస్ నేత డబ్బులు పంచుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న B Z జమీర్ అహ్మద్ ఖాన్ కోసం ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. మహిళలకు డబ్బులు ఇస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జమీర్ అహ్మద్ ఖాన్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Next Story

Most Viewed