యుద్ధ రంగానికి దూరంగా పుతిన్-ట్రంప్ భేటీ: జెలెన్‌స్కీ

by Phanindra |

డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ కలిసి అలస్కాలో భేటీ కానున్నారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. యుద్ధ రంగానికి దూరంగా భేటీ జరుగుతోందని చురకలేశారు.

యుద్ధ రంగానికి దూరంగా పుతిన్-ట్రంప్ భేటీ: జెలెన్‌స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అలస్కా వేదికగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కలవబోతున్నారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ భూభాగాలను ఆక్రమణదారులపరం చేయబోమని ఆయన స్పష్టంచేశారు.

‘మా ప్రమేయం లేకుండా, మాకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాళ్లు ఏం సాధించలేరు. ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఈ సమస్య తీరదు’ అని తేల్చిచెప్పారు. తమ ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతుంటే.. దీనికి చాలా దూరంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారని జెలెన్‌స్కీ చురకలేశారు.

Next Story