రామాయణ నాటకం పేరుతో గలీజ్ డ్యాన్సులు

by Muthe.Rajitha |

ఒడిశాలోని గంజాం జిల్లా దిగపొహండి సమితి మౌళాభంజ గ్రామంలో యాత్ర సందర్భంగా జరిగిన 'రామాయణం' నాటకం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.

రామాయణ నాటకం పేరుతో గలీజ్ డ్యాన్సులు
X

దిశ , వెబ్ డెస్క్ : ఒడిశాలోని గంజాం జిల్లా దిగపొహండి సమితి మౌళాభంజ గ్రామంలో యాత్ర సందర్భంగా జరిగిన 'రామాయణం' నాటకం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. నాటక ప్రదర్శనలలో కళాకారులు హద్దులు దాటి అనుచిత ప్రవర్తన ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట రెండు నాటక బృందాలు పోటాపోటీగా రామాయణం నాటకాలను యాభై గంటలకు పైగా ప్రదర్శించాయి.

ఈ ప్రదర్శనల్లో సీత పాత్రధారిణిని రావణుడు పాత్రలో ఉన్న కళాకారుడు అనుచితంగా తాకడం, ముద్దుపెట్టుకొవడం వంటి అశ్లీల దృశ్యాలు ప్రదర్శించారు. అంతేకాకుండా ఐటమ్ గర్ల్ నిషా మహరణా అశ్లీల నృత్యాలు, కిన్నెరల అర్ధ నగ్న నృత్య ప్రదర్శనలు, క్రేన్‌పై ఎక్కి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వంటివి ప్రదర్శించడం మరింత వివాదానికి దారితీసింది. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కళా సంస్థల ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగస్థల దర్శకుడు, ఆల్ ఇండియా థియేటర్ కౌన్సిల్ జాతీయ ఉపాధ్యక్షుడు రాజ్‌గోపాల్ పాఢి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంతో పవిత్రంగా భావించే రామాయణం వంటి పౌరాణిక నాటకంలో అశ్లీల ప్రదర్శనలు దారుణం అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇటువంటి అనుచిత ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులపై, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story