- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: ఫలిస్తున్న ట్రంప్ మధ్యవర్తిత్వం.. యుద్ధ విరమణకు రష్యా ఓకే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగానైనా యుద్ధ విరమణ చేయించడంలో ముందడుగు వేశారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధంలో 30 రోజుల సీజ్‌ఫైర్‌కు ఉభయ దేశాలను ఏకాభిప్రాయం మీదికి తెచ్చారు. ఉక్రెయిన్‌తో సీజ్‌ఫైర్‌కు ఒప్పించి.. ఆ ప్రతిపాదనను రష్యాకు పంపగా.. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తాత్కాలికంగానైనా యుద్ధ విరమణ చేయించడంలో ముందడుగు వేశారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధంలో 30 రోజుల సీజ్ఫైర్(Cease Fire)కు ఉభయ దేశాలను ఏకాభిప్రాయం మీదికి తెచ్చారు. ఉక్రెయిన్‌తో సీజ్‌ఫైర్‌కు ఒప్పించి.. ఆ ప్రతిపాదనను రష్యాకు పంపగా.. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. క్రెమ్లిన్‌లో ఓ విలేకరుల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. అమెరికా ప్రతిపాదించిన సీజ్‌ఫైర్‌కు సూత్రప్రాయంగా తాము అంగీకరిస్తున్నట్టు వెల్లడించారు. అయితే, ఇంకా కొన్ని అంశాలపై స్పష్టతకు రావాల్సిన అవసరమున్నదని, ఈ అడుగు శాశ్వత శాంతి సుస్థిరతకు దారివేసేలా ఉండాలని సూచించారు. యుద్ధ విరమణ అనే ఆలోచనను అభినందిస్తున్నామని, ఈ ఐడియా సరైనదని, దీనికి తాము మద్దతిస్తున్నట్టు చెప్పారు. కానీ, కొన్ని అంశాలపై ఇంకా చర్చించాల్సిన అవసరమున్నదన్నారు. వీటిపై అమెరికా కొలీగ్‌లు, తమ భాగస్వాములతో చర్చించాల్సి ఉన్నదని వివరించారు.
బలగాల మోహరింపు, ఆయుధాల సేకరణకు ఈ 30 రోజుల సీజ్‌ఫైర్‌ను ఉక్రెయిన్ ఉపయోగించుకుంటుందేమోననే అనుమానాలనూ పుతిన్ వ్యక్తపరిచారు. రష్యాకు చెందిన కుర్స్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ చుట్టుముట్టిందని, కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే దీనిపైనా స్పష్టతకు రావాలని పేర్కొన్నారు. వారు ఆయుధాలు ఇక్కడే వదిలేసి రాజీకి వస్తారా? రారా? అనేదీ కావాలన్నారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా చూసుకునే ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని చెబుతూ.. ఉక్రెయిన్‌పై అనుమానాలు వ్యక్తపరిచారు. ‘యుద్ధ విరమణ ప్రతిపాదనలను మేం అంగీకరిస్తున్నాం. కానీ, ఈ ఘర్షణ మొదలవడానికి మూలకారణాలను పరిష్కరించాలని, శాశ్వత శాంతి సుస్థిర నెలకొనేలా కాల్పుల విరమణ జరగాలి’ అని పుతిన్ తెలిపారు. అమెరికా ఉక్రెయిన్ను ఒప్పించినట్టు కనిపిస్తున్నా.. ఇందుకు అంగీకరించడానికి యుద్ధక్షేత్రంలో పరిస్థితులూ దోహదపడుతున్నట్టు అనుమానించారు. రష్యా కుర్స్క్ రీజియన్‌ను ఉక్రెయిన్ ఆక్రమించిందని, ఈ సమయంలో 30 రోజుల సీజ్ఫైర్ ఆ దేశానికి కలిసి వస్తుందని ఉక్రెయిన్ భావిస్తున్నట్టు ఉన్నదన్నారు.
పుతిన్ వ్యాఖ్యలు ఆహ్వానించతగ్గవే: ట్రంప్
దిశ, నేషనల్ బ్యూరో: కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యలు ఆశావహంగా ఉన్నాయని, అయితే, అవి అసమగ్రంగానే ఉన్నాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రూట్‌తో ఓవల్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా పుతిన్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ‘తుది ఒప్పందానికి సంబంధించి అనేక వివరాలను ఇది వరకే వారితో చర్చించాం. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉన్నది. ఒక వేళ అంగీకరించకుంటే ప్రపంచానికి చేదు నిజమే అవుతుంది’ అని పేర్కొన్నారు. పుతిన్‌తో మాట్లాడాలని తాను భావిస్తున్నానని, కానీ, ఈ ప్రక్రియను చాలా వేగవంతంగా సాగించాలని తెలిపారు. ‘మీ అందరికి తెలుసు సంపూర్ణ కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యా కూడా అంగీకరిస్తుందని భావిస్తున్నాం. రష్యా కూడా సరైన నిర్ణయమే తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.






