- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Surgical Strike: సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాస్పద వ్యాఖ్యలు చేశారు. 2016లో పాకిస్థాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాక్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా? పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.
బీజేపీ విమర్శలు
ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాక్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాక్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్థాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి’ అంటూ కౌంటరిచ్చారు. ఉగ్రదాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సమయంలోనూ కాంగ్రెస్ ఎంపీ రాజకీయాల్లో మునిగిపోయారని సిర్సా ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి కూడా కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ "పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోంది" అని ఆరోపించారు. చన్నీ వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు రాసుకొచ్చారు."దారుణం.! రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తూనే ఉంది. ఇప్పుడు చరణ్‌జీత్ సింగ్ చన్నీ సాయుధ దళాలను ప్రశ్నిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ మన దళాలను ఎందుకు నిరుత్సాహపరుస్తుంది. కాంగ్రెస్ నేరుగా పాకిస్థాన్ నుండి ఆదేశాలు తీసుకుంటోంది" అంటూ ఫైర్ అయ్యారు.
మాట మార్చిన కాంగ్రెస్ ఎంపీ
మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. "మీరు సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడారు. మేం రుజువు అడగం. దానికి ఎటువంటి ఆధారాలు కోరలేదు. కానీ, బాధితుల కుటుంబాలకు, దేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు. ఆ తర్వాత, పాకిస్థాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.






