Visas: అమెరికాలో విదేశీ విద్యార్థులకు షాక్.. వీసాలను రద్దుచేస్తున్న అధికారులు!

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Visas: అమెరికాలో విదేశీ విద్యార్థులకు షాక్.. వీసాలను రద్దుచేస్తున్న అధికారులు!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులపై చర్యలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హర్వర్డ్ (Harward), స్టాన్ ఫోర్డ్ (Stanford) సహా పలు ప్రధాన యూనివర్సిటీల్లోని విద్యార్థుల వీసాలను యూఎస్ ఇమ్మి గ్రేషన్ అధికారులు రద్దు చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల పర్యవేక్షణను కఠినతరం చేయాలనే ట్రంప్ నిర్ణయంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు యూఎస్ అంతటా దాదాపు 150 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు సమాచారం. వీసాను రద్దు చేసినట్టు స్టూడెంట్స్‌కు సందేశాలు వస్తున్నాయి. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు అధికారులు వెల్లడించడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆకస్మికంగా వీసా క్యాన్సిల్ చేస్తుండటంతో విదేశీ స్టూడెంట్స్ భవిష్యత్‌పై ఆందోళన నెలకొంది.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం దాని అనుబంధ క్యాంపస్‌లలో డజన్ల కొద్దీ వీసాలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, మిన్నెసోటా స్టేట్ యూనివర్శిటీ-మంకాటోతో సహా అనేక ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ప్రభావితమయ్యాయి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల వీసాలను సైతం రద్దు చేస్తున్నారు. అయితే వీసాలు రద్దు చేసిన పలువురు విద్యార్థులు పాలస్తీనా అనుకూల కారణాలకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొనగా, మరికొందరు ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చట్టపరమైన రూల్స్ అతిక్రమించినట్టు పలు కథనాలు వెల్లడించాయి.

Next Story