- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visa: అమెరికాలో భారతీయ విద్యార్థిని పరిస్థితి విషమం.. ఆమె తండ్రి తక్షణ వీసా కోసం భారత్ విజ్ఞప్తి
మహారాష్ట్రకు చెందిన నీలం షిండే అనే విద్యార్థిని అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. అయితే ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నీలం షిండే (Neelam shinde) అనే విద్యార్థిని అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (Masters degree) చదువుతోంది. అయితే ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే షిండేను చూసుకోవడానికి యూఎస్ వెళ్లేందుకు ప్రభుత్వ సహాయం కావాలని తన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు విన్నవించారు. షిండే తండ్రికి వీసా ఇప్పించడంలో సహాయం చేయాలని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే (Supriya sule) సైతం సోషల్ మీడియాలో విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker)కు విజ్ఞప్తి చేశారు. ఇది ఆందోళన కలిగించే సమస్య అని, దీనిని పరిష్కరించడానికి మనమందరం కలిసి రావాలని తెలిపారు.
దీంతో ఈ విషయాన్ని వెంటనే భారత విదేశాంగ శాఖ అమెరికా వద్ద లేవనెత్తింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న అమెరికా ముంబైలోని కాన్సులేట్ కార్యాలయంలో ఇంటర్వ్యూ కోసం షిండే తండ్రిని పిలిచినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు విద్యార్థి తండ్రితో అత్యవసర వీసా మంజూరుకు గాను ఇంటర్వ్యూ నిర్వహించున్నట్టు సమాచారం. ‘ఫిబ్రవరి 16న నీలం ప్రమాదానికి గురైనట్టు మాకు సమాచారం అందింది. అప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇంకా ఖరారు కాలేదు’ అని ఆమె తండ్రి తనాజీ షిండే తెలిపారు. కారు షిండేను వెనుక నుంచి ఢీకొట్టడంతో, ఆమె చేతులు, కాళ్ళు, చాతీ, తలపై తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.






