- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virat Kohli : ఉగ్రదాడిని ఖండించిన విరాట్ కోహ్లీ
జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనను ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖండించారు. ఈ చర్యకు ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. ముష్కరుల కాల్పుల్లో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా కోహ్లీ ట్వీట్ చేశారు. అలాగే మరో క్రికెటర్ రోహిత్ శర్మ(Rohith Sharma).. ఈ దాడితో తన హృదయం ముక్కలైందని అన్నారు. బ్రోకెన్ హార్ట్ ఎమోజీని తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. వీరితో కేఎల్ రాహుల్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అలియా భట్, కరీనా కపూర్ లు మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలిపారు.






