రెండు బస్సుల మధ్య నుజ్జునుజ్జయిన ఆటో.. నెట్టింట వీడియో వైరల్

by Naga Rani Yarlagadda |

ఒడిశాలోని భువనేశ్వర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

రెండు బస్సుల మధ్య నుజ్జునుజ్జయిన ఆటో.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని భువనేశ్వర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బస్సు డాష్ క్యామ్ లో రికార్డవ్వగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాద ఘటనపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బస్సు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా వెళ్తుండగా.. దాని ముందు ఆటో ఆగి ఉంది. అప్పటికే సిగ్నల్ వద్ద ఆగిన బస్సు, దాని వెనుక ఉన్న ఆటో.. గ్రీన్ సిగ్నల్ కోసం ఆగి ఉన్నాయి. వెనుక నుంచి వచ్చిన మరో బస్సు కంట్రోల్ తప్పి ఆటోను ఢీ కొట్టడంతో... ముందున్న బస్సు లోపలికి చొచ్చుకుపోయి నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆటో డ్రైవర్ మరణించారు. వెంటనే అక్కడున్న ఇతర వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తమై ఆటోను బస్సు నుంచి వెలికి తీశారు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదం తర్వాత ఆటో ముందున్న బస్సు ఎలాంటి ప్రమాదం జరగనట్లుగా ముందుకు వెళ్లిపోతుండగా ప్రయాణికుల కేకలు, అక్కడున్న వారు అరవడంతో ఆ బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు. జనవరి 3వ తేదీ శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

Next Story