Viral 'Mahakumbh' Girl: ప్రేమ వివాహం చేసుకున్న కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసా

by S Gopi |

ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలోని తిరువనంతపురం సమీపంలోని పూవార్‌లోని అరుమనూర్ శ్రీ నైనార్ దేవ ఆలయంలో వివాహం చేసుకుంది.

Viral Mahakumbh Girl: ప్రేమ వివాహం చేసుకున్న కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసా
X

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా భోంస్లే ప్రేమ వివాహం చేసుకుంది. బుధవారం ఆమె తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలోని తిరువనంతపురం సమీపంలోని పూవార్‌లోని అరుమనూర్ శ్రీ నైనార్ దేవ ఆలయంలో వివాహం చేసుకుంది. తండ్రి నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, అమె తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకలో కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ హాజరైనట్లు కేరళ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పలు నివేదికల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నారు. అయితే, వారిద్దరిదీ వేర్వేరు మతాలు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే పెళ్లికి నిరాకరించారు. దూరపు బంధువుతో బలవంతంగా వివాహం చేసుకోవాలని ఆయన ఆమెను ఒత్తిడి చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో షూటింగ్ కోసం వెళ్లిన ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి అక్కడకు వెళ్లారు. అందుకు నిరాకరించిన మోనాలిసా, పోలీసులను ఆశ్రయించి, తండ్రి నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కావాలని కోరారు. అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో వారి వివాహం జరిగింది.

Next Story