నిరసనల పేరుతో బీభత్సం.. యాపిల్ స్టోర్‌లో దోపిడీ.. వైరల్‌గా లైవ్ వీడియోలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-11 14:21:49  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donarld Trump) అక్రమ వలసదారులపై కఠిన నిర్ణయాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్‌ అధికారులు చేపట్టిన అరెస్టులతో లాస్ ఏంజెలెస్‌(Los Angeles protest) అట్టుడుకుతోంది.

నిరసనల పేరుతో బీభత్సం.. యాపిల్ స్టోర్‌లో దోపిడీ.. వైరల్‌గా లైవ్ వీడియోలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donarld Trump) అక్రమ వలసదారులపై కఠిన నిర్ణయాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్‌ అధికారులు చేపట్టిన ఆకస్మిక అరెస్టులు లాస్ ఏంజెలెస్ (Los Angeles protest) నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఒకవైపు ఇమిగ్రేషన్ అధికారుల గాలింపులు, మరోవైపు ప్రజా నిరసనలు డౌన్‌టౌన్‌ను కుదిపేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని పలువురు దుండగులు రెచ్చిపోతున్నారు. ముసుగులు ధరించి పలు వ్యాపార కేంద్రాల్లో అందినకాడికి దోచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వైరల్ వీడియోలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

డౌన్‌టౌన్‌లో రాత్రి పూట రోడ్డులు నినాదాలతో మారుమోగుతున్న వేళ, కొందరు యువకులు గుంపుగా ముసుగు ధరించి యాపిల్ స్టోర్ (Apple) అద్దాల కిటికీలను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. కొన్ని సెకన్లలోనే విలువైన ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఇతర గ్యాడ్జెట్‌లను లూటీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా, ఇప్పటికే సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారి ప్రజలను షాక్‌కు గురిచేశాయి.

యాపిల్ స్టోర్ మాత్రమే కాదు.. చెప్పులు, దుస్తుల స్టోర్లు, జ్యూవలరీ షాప్‌లు కూడా దోపిడీకి గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి వెంటనే దర్యాప్తు చేపట్టారు. పలువురిని అరెస్ట్ చేసినట్టు లాస్ ఏంజెలెస్ పోలీసు అధికారి క్రిస్ మిల్లర్ తెలిపారు. అయితే ఎక్కువ మంది ముసుగు ధరించి ఉండటంతో దుండగులను గుర్తించటం కష్టంగా మారిందన్నారు.

Next Story