రైఫిల్స్ కాన్వాయ్‌పై అటాక్.. ఇద్దరు జవాన్లు మృతి, నలుగురికి గాయాలు

by Gantepaka Srikanth |

మణిపూర్‌(Manipur)లో మళ్లీ హింస చెలరేగింది. విష్ణుపూర్‌లో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌(Rifles Convoy)పై దుండగులు కాల్పులు జరిపారు.

రైఫిల్స్ కాన్వాయ్‌పై అటాక్.. ఇద్దరు జవాన్లు మృతి, నలుగురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌(Manipur)లో మళ్లీ హింస చెలరేగింది. విష్ణుపూర్‌లో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌(Rifles Convoy)పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే మృతిచెందగా(Two Jawans Dead), మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా, మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏడాదిన్నరగా అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్‌లో హింస మరోసారి పెచ్చుమీరింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై కూడా గతంలో దాడికి యత్నించాయి. వరుసగా గృహ దహనాలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాస్త శాంతించినట్లుగానే కనిపించినా మణిపుర్‌లో మళ్లీ అగ్గి రాజుకుంది. మరోవైపు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

Next Story