- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 10 మంది మృతి
మణిపూర్ లో హింసాకాండ కొనసాగుతోంది. తాజాగా మరోసారి దుండగులు రెచ్చిపోయారు. తూర్పు ఇంఫాల్ లోని ఖమెన్ ప్రాంతంలోని ఓ చర్చిలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో సహా 10 మంది మృతి చెందారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ లో హింసాకాండ కొనసాగుతోంది. తాజాగా మరోసారి దుండగులు రెచ్చిపోయారు. తూర్పు ఇంఫాల్ లోని ఖమెన్ ప్రాంతంలోని ఓ చర్చిలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో సహా 10 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. కాల్పులు జరుగుతున్న సమయంలో చర్చి లోపల 25 మంది ఉన్నారు. ఈ కాల్పుల వెనుక కుకీ మిలిటెంట్ గ్రూప్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గాయపడిన వారికి ఇంఫాల్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ హింసాకాండలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 115 కు చేరింది. మణిపూర్ అల్లర్లపై కేంద్రం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Next Story






