Vinod: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వినోద్ చంద్రన్.. కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోదం

by B.Srinivas |

పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే. వినోద్ చంద్రన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Vinod: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వినోద్ చంద్రన్.. కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే. వినోద్ చంద్రన్ (vinod Chandran) సుప్రీంకోర్టు (Supreme court) న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ నెల 7న వినోద్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun ram meghval) సోమవారం వెల్లడించారు. జస్టిస్ చంద్రన్ నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరనుంది. కాగా, తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ కళాశాల నుంచి లా పట్టా పొందిన చంద్రన్ 2007 నుంచి 2011 వరకు కేరళ ప్రభుత్వానికి ప్రత్యేక ప్లీడర్‌గా పనిచేశారు. 2011 నవంబర్8న కేరళ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. అనంతరం 2023 మార్చి 29న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అదే పదవిలో ఉండగా తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.

Next Story