- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్-పాక్ మధ్య ‘అణుయుద్ధం’ సూచనే లేదు.. స్టాండింగ్ కమిటీకి మిస్రీ వివరణ
భారత్, పాక్ మధ్య ‘అణుయుద్ధం’ సూచనలే కనిపించలేదని విక్రమ్ మిస్రీ చెప్పారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ఆయన ఈ విషయం స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ ఉద్రిక్తతల సమయంలో ఎలాంటి ‘అణుయుద్ధం’ సూచనలు కనిపించలేదని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ స్పష్టం చేసినట్లు సమాచారం. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత విదేశాంగ విధానంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మిస్రీ ఇదే సమాధానం చెప్పారట. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు సంప్రదాయ పోరాటం స్థాయిలోనే ఉన్నాయని, అణుయుద్ధం వైపు అసలు వెళ్లలేదని కమిటీకి మిస్రీ తెలియజేశారు. పాకిస్తాన్ అణుబాంబులు ఉపయోగించే సూచనలేవీ తమకు కనిపించలేదని ఆయన వివరించారట. అలాగే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం డీజీఎంవో స్థాయి చర్చల్లోనే జరిగిందని, దీనిలో యూఎస్ పాత్ర ఏమాత్రం లేదని ఆయన పునరుద్ఘాటించారు.
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై కమిటీ సభ్యులు ప్రశ్నించగా.. మే 10న డీజీఎంవోల చర్చల్లోనే కాల్పుల విమరణ ఒప్పందం జరిగిందని మిస్రీ స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే భారత్‌పై దాడి చేసేందుకు చైనా మిలటరీ వ్యవస్థలు, ఆయుధాలను వాడుకుందా అని సభ్యులు అడగ్గా.. ‘పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లను భారత దళాలు విజయవంతంగా టార్గెట్ చేశాయి. అలాంటప్పుడు వాళ్లు ఏ దేశపు ఆయుధాలు వాడితే ఏంటి?’ అని మిస్రీ అడిగారట. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. దీనిలో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ శుక్లా, దీపేందర్ హుడా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ నేతలు అపరాజిత సారంగి, అరుణ్ గోవిల్ తదితరులు ఈ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.






