విజయ్‌కి BIG షాక్.. విడాకులు కోరిన భార్య సంగీత

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-27 11:34:22  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్‌కి బిగ్ షాక్ తగిలింది.

విజయ్‌కి BIG షాక్.. విడాకులు కోరిన భార్య సంగీత
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్‌(Thalapathy Vijay)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన భార్య సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని విజయ్‌కి నోటీసులు జారీ చేసింది. గతేడాది నుంచి వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటారని రూమర్స్ వచ్చాయి. 1999లో విజయ్-సంగీత వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లైన 26ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశమవుతోంది.

కాగా, ఇటీవల విజయ్‌ - నటి త్రిష మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. ఏకంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేయడం దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపై త్రిష స్పందించి సీరియస్ కావడంతో ఆయన సారీ చెప్పారు. అయితే.. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి.. విజయ్ వివాహేతర సంబంధమే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story