- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay: త్వరలో నిజం బయటకు వస్తుంది.. కరూర్ ఘటనపై తొలిసారి విజయ్ రియాక్షన్

దిశ, డైనమిక్ బ్యూరో: 41 మందిని బలితీసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ తొలిసారి స్పందించారు. తన జీవితంలో ఇంత విషాదకరమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొనలేదని, ఈ ఘటన నన్ను కలిచి వేసిందని ప్రస్తుతం నా హృదయం ఆవేదనతో నిండిపోయిందన్నారు. ఎంతో ప్రేమతో నా మీటింగ్ కు ప్రజలు వచ్చారని త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు. మేము ఇప్పటికే 5 జిల్లాల్లో ప్రచారం చేసా. కానీ ఇది కరూర్‌లో మాత్రమే ఎందుకు జరిగింది? మిగతాచోట్లా ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. సీఎం స్టాలిన కావాలనుకుంటే నామీద ప్రతీకారం తీర్చుకోవచ్చు. అంతే కానీ నాపై కోపం మా నాయకులపై చూపించవద్దన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ మేరకు నాలుగు నిమిషాల నిడివి కలిగిన వీడియో సందేశాన్ని ఇవాళ ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. నేను భద్రతకే ప్రాధాన్యత ఇస్తాను. నన్ను టార్గెట్ చేయండి కానీ నా ప్రజలు కాదన్నారు. నేనూ మనిషినే.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊహించని ఘటన జరిగింది. నేను ఎప్పుడూ ఎవరికీ అపకారం తలపెట్టలేదన్నారు.
కాగా గత శనివారం జరిగిన ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు వయ్ కేవలం ఎక్స్ లో 'నా హృదయం ముక్కలైంది. భరించలేని బాధలో ఉన్నాను. ఆ వేదనను మాటల్లో చెప్పలేను అంటూ ఓ పోస్టు మాత్రమే చేశారు. ఈ ఘటనపై తీవ్రమైన విమర్శలతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్న వేళ విజయ్ తన వీడియో సందేశాన్ని పంపించారు.






