తమిళనాట విజయ్ మార్క్ రాజకీయం.. టీవీకేను గెలిపించిన ఆ ‘ఏడు’ హామీలు ఇవే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-04 08:53:51  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించిన నేపథ్యంలో విజయ్ ప్రకటించిన ఎన్నికల హామీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళనాట విజయ్ మార్క్ రాజకీయం.. టీవీకేను గెలిపించిన ఆ ‘ఏడు’ హామీలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళగ వెట్రి కజగం (TVK) ఆవిర్భవించింది. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం విజయ్ పార్టీ 109 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక డీఎంకే 61, ఏఐడీఎంకే అభ్యర్థులు 64 సీట్లలో లీడ్‌లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందుకు చేస్తూ వచ్చిన ఫలితాలను చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, ముఖ్యంగా మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునేలా విజయ్ రూపొందించిన మేనిఫెస్టో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించింది.

టీవీకే ప్రధాన ఎన్నికల హామీలు.. ఇవే

మహిళా సంక్షేమం: మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం అందజేయడంతో పాటు, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు రుణమాఫీ: 5 ఎకరాల్లోపు సాగు భూమి ఉన్న రైతులకు సంబంధించి అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

విద్యార్థులకు ప్రోత్సాహం: విద్యార్థుల చదువుల కోసం ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు.

నిరుద్యోగ భృతి: ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రతి నెలా రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉచిత గ్యాస్ సిలిండర్లు: పేద కుటుంబాలకు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.

స్థానికులకే ఉద్యోగాలు: ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగాల్లో 75 శాతం కేవలం స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నిరుపేద వధువులకు బంగారం: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని వధువులకు వివాహ కానుకగా 8 గ్రాముల బంగారం అందజేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో విజయ్ సునామీ.. తెలుగు రాజకీయాల్లో 'ఫ్రెండ్షిప్' పాలిటిక్స్!

Next Story