మాతో డీల్‌కు ట్రంప్ ఆరాటపడ్డారు: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ

by Kema Shiva Kumar |

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాతో డీల్‌కు ట్రంప్ ఆరాటపడ్డారు: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాతో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆరాటపడ్డారని (Desperate), అందుకు ఇరాన్‌పై అన్ని రకాల ఒత్తిళ్లను ఉపయోగించారని ఖమేని కామెంట్ చేశారు. సైద్ధాంతికంగా తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నా.. దేశ ప్రయోజనాలను దృష్ట్యా ఒప్పందానికి తాను ఆమోదం తెలిపామని ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ దేశ హక్కులకు, తమ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆశయాలకు ఎలాంటి భంగం కలగబోదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian), సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తనకు గట్టి హామీ ఇచ్చాయని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే ఈ ఒప్పందానికి తాను అనుమతించానని మోజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. అమెరికాతో రాబోయే రోజుల్లో ముఖాముఖి చర్చలు జరపడం అంటే శత్రువుల షరతులకు, వారి వైఖరికి లొంగిపోవడం కాదని ఇరాన్ ప్రజలకు ఆయన స్పష్టం చేశారు.

Next Story