Actor Vijay : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విజయ్ పిటిషన్

by Muthe.Rajitha |

నటుడు, తమిళనాడు విక్టరీ ఖజగం(TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay), వక్ఫ్ సవరణ చట్టం 2024(Waqf Amendement Bill 2024)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

Actor Vijay : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విజయ్ పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు, తమిళనాడు విక్టరీ ఖజగం(TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay), వక్ఫ్ సవరణ చట్టం 2024(Waqf Amendement Bill 2024)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఏప్రిల్ 16న విచారణకు రానున్నట్టు సమాచారం. ఈ చట్టంలోని సవరణలు రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని, ముఖ్యంగా మత స్వేచ్ఛ, సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని, తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని విజయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా, వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగించడం, వక్ఫ్ బోర్డులలో నామినేటెడ్ సభ్యుల నియామకం, బోర్డు నిర్వహణలో ప్రభుత్వ జోక్యం పెరగడం వంటి నిబంధనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

ఈ మార్పులు వక్ఫ్ బోర్డులను దెబ్బతీస్తాయని, మతపరమైన సంస్థల స్వతంత్రతను కాలరాస్తాయని ముస్లిం సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా... కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story