- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ఫ్యామిలీ చిన్నాభిన్నం! భార్య లండన్‌లో.. కొడుకు అద్దె ఇంట్లో, కూతురు హాస్టల్‌లో.. అసలేం జరుగుతోంది?
తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. వెండితెరపై 'దళపతి'గా కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగిస్తూ, రాజకీయాల్లో మార్పు కోసం పార్టీ పెట్టిన విజయ్.. తన సొంత కుటుంబాన్ని చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా విజయ్ కుటుంబం చిన్నాభిన్నమైందని, కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరు ఒక్కో చోట ఆశ్రయం పొందుతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కోర్టు మెట్లెక్కిన భార్య సంగీత
విజయ్‌తో విడాకుల వ్యవహారం ముదురుతుండటంతో ఆయన భార్య సంగీత తాజాగా చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించారు. విజయ్ ప్రస్తుతం తనను చెన్నైలోని 'నీలాంకరై' నివాసంలోకి రానివ్వడం లేదని, తనకు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విడాకుల కేసు తేలే వరకు తనకు ఆ ఇంట్లో నివసించే హక్కు కల్పించాలని ఆమె మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న విజయ్ కుటుంబం ఇప్పుడు ఆగమాగం అయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భార్య సంగీత ప్రస్తుతం లండన్‌లో ఉంటూ, కేసు నిమిత్తం అప్పుడప్పుడు చెన్నై వస్తున్నారు. కుమారుడు జాసన్ సంజయ్ తండ్రి వద్ద ఉండలేక అశోక్ నగర్‌లోని ఒక అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. కుమార్తె దివ్య సాషా ఒక పీజీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నట్లు తమిళనాట వార్తలు వస్తున్నాయి. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్, తల్లి శోభ చాలా కాలంగా ఆయనకు దూరంగా వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒక నటితో విజయ్‌కు ఉన్న సంబంధమే ఈ గొడవలకు కారణమని భార్య సంగీత ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
250 కోట్ల రెమ్యునరేషన్ ఉన్నా.. ఏం లాభం?
సినిమాకు రూ. 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న విజయ్.. తన సొంత భార్య పిల్లలను చూసుకోలేకపోతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ఒకవైపు "తమిళనాడు అంటే విజయ్.. విజయ్ అంటే తమిళనాడు" అని పొగుడుతున్నప్పటికీ, విజయ్ మాత్రం తన సొంత తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం లేదని విమర్శలు వస్తున్నాయి. ‘సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు.. రాష్ట్రాన్ని ఏం ఏలుతాడు?’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టారు. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా.. కన్నవారు, భార్యాపిల్లలు పక్కన లేకపోవడంపై అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కుటుంబ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.






