మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు.. ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి

by Prasad Jukanti |

రెయిడ్స్ కోసం వచ్చిన ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తలు దాడికి పాల్పడటం కలకలం తీవ్ర కలకలం రేపింది.

మాజీ సీఎం విజయన్ ఇంట్లో  సోదాలు..  ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెయిడ్స్ కోసం వచ్చిన ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తలు దాడి చేశారు. అధికారుల కార్లపై ఇటుక రాళ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. కార్లు ధ్వంసం అయ్యాయి. తిరువనంతపురంలోని విజయన్ నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. కాగా విజయన్ కుమార్తె కంపెనీకి సీఎంఆర్ఎల్ రూ. 1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి సేవలు అందించకుండానే డబ్బు చెల్లించారనే ఆరోపణలతో మనీలాండరింగ్ జరిగిందనే కోరణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ విజయన్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగింది.

Next Story