- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొత్తం ఖర్చు నాదే.. ప్రమాణస్వీకారానికి ముందే విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే టీవీకే అధినేత దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖనాజా నుండి భరిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే టీవీకే అధినేత దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖనాజా నుండి భరిస్తారు. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం. విజయ్ నిర్ణయం వల్ల ప్రభుత్వ డబ్బు వృథా కాకుండా ఉంటుంది. ప్రస్తుతం వార్త వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో విజయ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు ఇది పీఆర్ స్టంట్ అంటూ డీఎంకే విమర్శలు చేస్తోంది.
సినిమాల పబ్లిసిటీ కోసం పీఆర్ చేసుకోవడం బాగా తెలిసిన విజయ్ రాజకీయాలకు అదే అప్లై చేస్తున్నాడంటూ డీఎంకే కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాట పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే 108 సీట్లు గెలిచి టీవీకే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లి రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక విజయ్ సీఎంగా ఫిక్స్ అయినప్పటికీ మద్దతు కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించింది. మరోవైపు అన్నాడీఎంకేతోనూ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది.






