Vijay: ఈలం తమిళులకు ప్రభాకరన్ తల్లి లాంటి వాడు.. టీవీకే చీఫ్ విజయ్ ప్రశంసలు

by B.Srinivas |

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) చీఫ్ ప్రభాకరన్‌పై తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ప్రశంసలు కురిపించారు.

Vijay: ఈలం తమిళులకు ప్రభాకరన్ తల్లి లాంటి వాడు.. టీవీకే చీఫ్ విజయ్ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) చీఫ్ ప్రభాకరన్‌పై తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్ (Vijay) ప్రశంసలు కురిపించారు. ఈలం తమిళులకు ప్రభాకరన్ తల్లి లాంటి వ్యక్తి అని తెలిపారు. దేశంలో నివసిస్తున్న శ్రీలంక తమిళుల తరఫున గొంతును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగపట్నంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈలం తమిళులు ఇప్పటికీ బాధలో ఉన్నారు, ఎందుకంటే వారికి తల్లి లాంటి ప్రేమను పంచిన ప్రభాకరన్‌ను కోల్పోయారని చెప్పారు. అందుకే వారు ప్రపంచంలో ఎక్కడున్నా వారి కోసం మాట్లాడాలన్నారు. శ్రీలంక తమిళుల సమస్య తమిళనాడులో ముఖ్యమైందన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం తన పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని స్పష్టం చేశారు.

మత్స్యకారుల జీవితాలతో పాటుఈలం తమిళుల కలలు కూడా తమకు అంతే కీలకమైనవని తేల్చి చెప్పారు. మత్స్యకారుల సమస్యపై సుధీర్ఘ లేఖ రాసి మౌనంగా ఉండే డీఎంకే లాంటి వాళ్లం కాదన్నారు. కాగా, విజయ్ శ్రీలంక తమిళులకు మద్దతు ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. 2008లోనూ శ్రీలంకలో తమిళుల హత్యలకు వ్యతిరేకంగా ఆక్ష్న నిరాహార దీక్ష చేశారు. అయితే తాను తమిళులకు మాత్రమే మద్దతిస్తానని, నిషేధిత ఎల్‌టీటీఈకి కాదని స్పష్టం చేశారు.

Next Story