మరోసారి డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డ విజయ్

by Malleboina Mahesh |

2027 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తున్నాడు.

మరోసారి డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డ విజయ్
X

దిశ, వెబ్ డెస్క్: 2027 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తున్నాడు. తాజాగా తమిళనాడులోని ఈరోడ్‌లో జరిగిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. అధికార పార్టీ డీఎంకే (DMK) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎంకేను ఒక "దుష్ట శక్తి"గా అభివర్ణించిన ఆయన, తన పార్టీని ఒక "స్వచ్ఛమైన శక్తి"గా పేర్కొన్నారు. డీఎంకే నాయకత్వం అసహ్యకరమైన రాజకీయాలకు పాల్పడుతూ, తనపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటానని, ప్రజలు కూడా తన వెంటే ఉన్నారని ఈ సందర్భంగా విజయ్ ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, సమస్యలు అనేవి 'ఫెవికాల్' బంధంలా విడదీయలేకుండా కలిసిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న ఈ అపవిత్ర పోకడలు తనకు అర్థం కావడం లేదని, అయితే తమ పార్టీ ఎన్నటికీ అటువంటి నీచ రాజకీయాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే విజయ్ సభకు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ఉండటంతో తెల్లవారుజామున కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త విజయ్ మాట్లాడుతుండగా.. కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో అప్రమత్తం అయిన పార్టీ నేతలు, వాలంటీర్ల సహాయంతో అక్కడే ఉన్న అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు.

Next Story