కొద్దిరోజుల్లో నిశ్చితార్థం.. ప్రేమజంటను బలితీసుకున్న విజయ్ సభ

by Naga Rani Yarlagadda |

తమిళనాడులోని కరూర్ లో రెండ్రోజుల క్రితం టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో

కొద్దిరోజుల్లో నిశ్చితార్థం.. ప్రేమజంటను బలితీసుకున్న విజయ్ సభ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూర్ లో రెండ్రోజుల క్రితం టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో (Vijay corner meeting Stempede) 40 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇదే సభలో ఓ ప్రేమజంట పెళ్లిపీటలెక్కకుండానే మృత్యు ఒడికి చేరింది. పెళ్లి జీవితంపై ఎన్నో కలలు కన్న వారికథ ఇలా విషాదాంతమైంది. అక్టోబర్లో ఎంగేజ్మెంట్, జనవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆకాశ్ (26), గోకులశ్రీ (26) తొక్కిసలాటలో మరణించారు.

వివరాల్లోకి వెళ్తే.. ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆకాశ్, వల్లువార్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న గోకులశ్రీ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరికీ ఫేవరెట్ యాక్టరైన విజయ్ ను డైరెక్ట్ గా చూసేందుకు శనివారం గోకులశ్రీ అన్నయ్య.. ప్రభాకరన్ తో కలిసి మీటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో రావాల్సిన విజయ్.. ఏడుగంటలు ఆలస్యంగా వచ్చారు. గంటల ఎదురుచూపుల అనంతరం విజయ్ రావడంతో.. అతడిని చూసేందుకు జనం మధ్య జరిగిన తీవ్రమైన తొక్కిసలాటలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని ప్రభాకరన్ తెలిపారు. ఓ ఇంటి టెర్రస్ పై ఉన్న తాము.. కిందికి దిగుతుండగా.. ఒక్కసారిగా జనమంతా మీద పడ్డారని చెప్పారు.

ఇటీవలే తనకు యాంజియోప్లాస్టీ జరగడంతో తనను పక్కకు వెళ్లమని గోకులశ్రీ చెప్పిందన్నారు. కొద్ది క్షణాల్లోనే తొక్కిసలాటలో ఆకాశ్, గోకులశ్రీ ప్రాణాలు కోల్పోయారని కన్నీటి పర్యంతమయ్యారు. మూడు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంట ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని వాపోయారు.

Next Story