TVK: కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం

by Prasad Jukanti |

రాష్ట్ర వ్యాప్త పర్యటనలపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

TVK: కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరూర్ తొక్కిసలాట ఘటన (Karur stampede) నేపథ్యంలో తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ చీఫ్ విజయ్ (Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలను వాయిదా వేసుకున్నారు. రెండు వారాల పాటు పార్టీ అధినేత తన పర్యటనలు వాయిదా వేసుకున్నట్లు టీవీకే పార్టీ బుధవారం వెల్లడించింది. తదుపరి పర్యటనల వివరాలు పార్టీ అధినేత ఆమోదంతో తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. వచ్చే వారం కరూర్ బాధితులను విజయ్ పరామర్శించనున్నారు. పోలీసుల అనుమతితో కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.

తొక్కిసలాట ఘటన ఘటనపై విజయ్ వర్సెస్ అధికార డీఎంకే మధ్య రాజకీయ దుమారం రేగింది. కరూర్ ప్రమాద ఘటనపై నిన్న వీడియో సందేశం విడుదల చేసిన విజయ్.. ముఖ్యమంత్రి స్టాలిన్ కు కోపం ఉంటే తనపై కక్ష తీర్చుకోవాలి అంతే తప్ప నా ప్రజల జోలికి వెళ్లొద్దు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే విజయ్ వ్యాఖ్యలకు డీఎంకే అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఈ మాత్రం వీడియో చేయడానికి మీకు నాలుగు రోజులు పట్టిందా అని నిలదీసింది. ప్రజల మృతికి కారణమైనందుకు విజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.

Next Story