Vijay: ప్రజలను హింసిస్తున్న బీజేపీ, డీఎంకే.. టీవీకే చీఫ్ విజయ్

by B.Srinivas |

కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాలు ప్రజలను హింసిస్తున్నాయని టీవీకే చీఫ్ విజయ్ ఆరోపించారు.

Vijay: ప్రజలను హింసిస్తున్న బీజేపీ, డీఎంకే.. టీవీకే చీఫ్ విజయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాలు ప్రజలను హింసిస్తున్నాయని తమిళగ వెట్రి కజగం (Tvk) చీఫ్ విజయ్ ఆరోపించారు. రెండు పార్టీలూ వివిధ మార్గాల్లో మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుచిరాపల్లి నుంచి తన తొలి రాష్ట్రవ్యాప్త పర్యటనను శనివారం ప్రారంభించారు. ప్రజలను పీడించే వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. దక్షిణ భారతదేశ రాజకీయ బలాన్ని తగ్గించే కుట్రలో భాగంగానే బీజేపీ డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తెస్తోందని ఫైర్ అయ్యారు. తమిళనాడు విద్యార్థులకు కేంద్రం నిధులు నిరాకరిస్తోందని, తమిళ ద్విభాషా విధానానికి విరుద్ధంగా హిందీ. సంస్కృతాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తోందన్నారు. శ్రీలంక నావికాదళం తమిళ మత్స్యకారులపై దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని తెలిపారు. బీజేపీ తమిళనాడుకు ద్రోహం చేస్త్తే డీఎంకే తన సొంత ప్రజలకు ద్రోహం చేసిందని ఆరోపించారు.

Next Story