హెల్మెంట్ ధరించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్... (వీడియో)

by S Gopi |

కేరళకు చెందిన బస్సు డ్రైవర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటగా నెటిజన్స్ చూసి షాకవుతున్నారు. ఆ...Video Viral: Kerala RTC Driver wears Helmet while Driving

హెల్మెంట్ ధరించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్... (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కేరళకు చెందిన బస్సు డ్రైవర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటగా నెటిజన్స్ చూసి షాకవుతున్నారు. ఆ తర్వాత విషయం తెలిసి ఓ అవునా అంటున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.... పీఎఫ్ఐ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కేరళలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొంతమంది రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తపరుస్తున్న సమయంలో బస్సులపై రాళ్ల దాడికి దిగుతున్నారు. ఇప్పటివరకు పలు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. హెల్మెంట్ ధరించి మరీ విధులు నిర్వర్తిస్తున్నాడు. పలువురు ప్రయాణికులు అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. మొదటగా విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత విషయం తెలిసినంక ఓ అవునా అని అంటున్నారు.

Next Story