Delhi Airport: భారీ వర్షాలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన రూఫ్

by Shamantha N |

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదులు గాలులు, వడగళ్ల వానతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Delhi Airport: భారీ వర్షాలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన రూఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదులు గాలులు, వడగళ్ల వానతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈదురుగాలులతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఉన్న రూఫ్‌ కొంత భాగం కూలిపోయింది. దీంతో అక్కడున్న వ్యక్తులు భయంతో పరుగులుతీశారు. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్ 1 వద్ద టెంట్‌ మాదిరిగా ఉన్న రూఫ్‌లోకి వర్షం నీరు చేరింది. దీంతో కొంతభాగం కూలిపోయింది. అందులో ఉన్న వర్షం నీరు అన్నివైపులా ప్రవహించింది. ఇది చూసి అక్కడున్న వ్యక్తులు భయంతో దూరంగా పరుగెత్తారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. మరోవైపు, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా 17 అంతర్జాతీయ విమానాలతో సహా 49 విమానాలను దారి మళ్లించారు. అంతేకాకుండా, దాదాపు 200కి పైగా విమానాలు ఆలస్యంగా మారాయి. వర్షం వల్ల విమానాశ్రయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిలిచిందని, దీంతో విమాన కార్యకలాపాలపై ప్రభావం పడిందని ఢిల్లీ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story