- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: చెబితే వినకపోతే ఎలా మేడం..! బైక్‌పై మహిళ చీర కొంగు ప్రమాదం.. వీడియో వైరల్
మన చుట్టూ ఎప్పుడూ మన మంచికే సలహాలు ఇచ్చే వారు కొందరు ఉంటారు. సూచనలను పట్టించుకోకపోవడం వల్ల కొంత మంది అనుకోని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: మన చుట్టూ ఎప్పుడూ మన మంచికే సలహాలు ఇచ్చే వారు కొందరు ఉంటారు. సూచనలను పట్టించుకోకపోవడం వల్ల కొంత మంది అనుకోని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో మహిళలు చీర కొంగు లేదా దుపట్టా బండి చక్రంలో చిక్కుకోని ప్రమాదాలకు కారణమవుతుంటాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. బైక్ పై ఓ జంట వెళ్తుంటారు. వాహనంపై ఉన్న మహిళ చీర కొంగు గాలీకి ప్రమాదకరంగా ఎగురుతోంది. బండి చక్రంలో చీర కొంగు ఇరుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇది గమనించిన మరో బైక్ రైడర్.. మహిళకు ప్రమాదం పొంచి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు. మీ చీర కొంగును సెట్ చేసుకోండి.. బైక్ టైర్‌లో ఇరుక్కుపోయేలా ఉందని పదే పదే మరో బైక్ నడిపే వ్యక్తి హెచ్చరించే ప్రయత్నం చేశారు. కానీ మహిళ మాత్రం అసలు వినిపించుకోలేదు. కొంత సమయం తర్వాత అతను చెప్పినట్లుగానే మహిళ చీర కొంగు టైరులో ఇరుక్కుని రోడ్డుపై కింద పడిపోయింది. రైడర్ బైక్ నెమ్మదిగా నడపడంతో మహిళకు పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఈ సంఘటన మరో బైక్ రైడర్ హెల్మెట్ కెమెరాలో రికార్డు అయింది. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
ఈ సంఘటనపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. చెబితే వినకపోతే ఎలా మేడం.. ఇప్పుడు చూడూ కిందపడ్డావని నెటిజన్‌లు కామెంట్స్ పెట్టారు. ఎవరైనా మంచి ఏదైనా చెప్తే వినాలని, లేకుంటే నిర్లక్ష్యం చేయడం అనర్థాలకు కారణమవుతోందని నెటిజన్‌లు కామెంట్స్ చేశారు. అయితే ఇది స్క్రిప్ట్ వీడియో అని పలువురు అభిప్రాయపడ్డారు. మహిళలను కూర్చో బెట్టుకొని బైక్ నడిపే వారికి ఒక ఎడ్యుకేషన్ వీడియోగా ఇది రూపొందించినట్లు నెటిజన్‌లు చెబుతున్నారు. అయితే ఈ వీడయో ఒరిజినల్ లేదా ఎడ్యుకేషన్ వీడియో అయిన బైక్‌పై వెళ్లే టప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు. తెలియని వ్యక్తులు ఎవరో చెప్పిన మంచి మాట వెనుక ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి.. ఎందుకంటే మంచి మాటను పట్టించుకోకపోవడం అంటే మనకే సమస్యలను ఆహ్వానించడమే అని ఈ ఘటనతో చాలా మంది నెటిజన్‌లు అర్థం చేసుకున్నారు. వైరల్ వీడియో..






