Viral video: రాత్రికిరాత్రే ఫేమస్ కావాలనే పిచ్చి.. హైవేపై బైకర్ల విన్యాసాలు వీడియో వైరల్

by Ramesh Naini |

రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం కొంత మంది యువత ఎంతకైనా తెగిస్తున్నారు.

Viral video: రాత్రికిరాత్రే ఫేమస్ కావాలనే పిచ్చి.. హైవేపై బైకర్ల విన్యాసాలు వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Social media) సోషల్ మీడియా వాడకం నేటి యువతలో ఎక్కువైంది. అందులోనూ కొంత మందికి (Reels) రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్, వ్యూస్, ఫాలొవర్లను పెంచుకోవడం కోసం ప్రాణాలతో చెలగాటం అడుతారు. తమ ప్రాణాలే కాకుండా తమకు సంబంధం లేని వారి ప్రాణాలను రిస్క్‌లో పెడతారు. యువతి, యువకులు (Dangerous stunts) ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

నేషనల్ హైవేపై బైక్ రైడర్‌లు ప్రమాదకరమైన స్టంట్స్ చేసిన (Viral video) వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో లో చూపించిన ప్రకారం.. ఇద్దరు బైక్ రైడర్లు పగలు సమయంలో రద్దీగా ఉండే హైవేపై ప్రమాదకర విన్యాసాలు చేశారు. ట్రాఫిక్ నియమాలను తుంగలో తొక్కి.. వేగంగా బైక్ రైడ్ చేస్తూ హ్యాండిల్ పట్టుకోకుండా చేతులు వదిలి పెట్టి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. అలాగే కిక్కు సరిపోదన్నట్లుగా మరింత ప్రమాదకరంగా.. ఓ రైడర్ తన ముందు వెళ్తున్న ట్రక్కు వెనుక.. బైక్ హ్యాండిల్ వదిలి పెట్టి పైకి లేచి ప్రమాదకర విన్యాసాలు చేయసాగాడు. బైక్ ముందు టైర్‌తో ట్రక్ వెనుక బాగానికి టచ్ చేస్తూ తెగ ఆనందించాడు.

ఈ స్టంట్స్ తతంగమంతా మరో బైక్ వ్యక్తి తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు వారిపై మండిపడ్డారు. రీల్స్ లైఫ్ అనుకోని లైక్స్ వ్యూస్ కోసం ఇదేం పని అని నెటిజన్‌లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదకర స్టంట్ వల్ల జరగరానిది ఏమైనా జరిగితే.. మీరు చనిపోవడమే కాకుండా ఇతర ప్రాణాలు కూడా రిస్క్‌లో పడుతాయని నెటిజన్‌లు కామెంట్ పెట్టారు. ఇలాంటి రీల్స్ చేసే వ్యక్తులను అరెస్ట్ చేయాలని నెటిజన్‌లు డిమాండ్ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి..

Next Story