- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stray Dogs: వీధి కుక్కల స్వైర విహారం.. ఇద్దరిపై ఘోర దాడి.. వీడియో వైరల్
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళతో పాటు ఓ వ్యక్తిపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో వీధి కుక్కల దాడి కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళతో పాటు ఓ వ్యక్తిపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం ప్రకారం.. స్థానికంగా ఉన్న రోడ్డుపై మహిళ, వ్యక్తి కలిసి వెళ్తుండగా అకస్మాత్తుగా గుంపుగా వచ్చిన వీధి కుక్కలు వారిపై దాడి చేశాయి. అప్రమత్తమైన మహిళ కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకోగా, కుక్కలు మాత్రం ఆ వ్యక్తిని వదలకుండా కొంతసేపు తీవ్రంగా కరిచాయి. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఓ యువకుడు ధైర్యంగా కుక్కలను తరిమికొట్టడంతో బాధితుడు ప్రాణాలతో బయట పడగలిగాడు. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలో వీధి కుక్కల నియంత్రణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. వీడియో ఇదే..






