- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవింగ్ లైసెన్స్ చూపించు! అహ్మదాబాద్‌లో మహిళపై పోలీసు అధికారి దాడి.. వీడియో వైరల్
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో మహిళపై ట్రాఫిక్ పోలీసు దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో మహిళపై ట్రాఫిక్ పోలీసు దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని అంజలి చార్ రస్తా వద్ద వాహన తనిఖీల సమయంలో ఒక మహిళ వాహనం నడుపుతున్న సమయంలో పోలీసులు వచ్చి ఆపారు. డ్రైవింగ్ లైసెన్స్ చూపాలని కోరగా, ఆమె లైసెన్స్ వెతకడానికి కొంత సమయం పట్టింది. ఈ క్రమంలో మహిళా పోలీసు అధికారిని తన గుర్తింపు కార్డు చూపించాలని కోరింది. గుర్తింపు కార్డు తిరిగి ఇచ్చే సమయంలో కార్డు ఆమె చేతి నుండి జారి నేలపై పడిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసు అధికారి మహిళను చెంపపై కొట్టాడు.
అంతటితో ఆగకుండా దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించగా, అక్కడ ఉన్న ఇతర పోలీసు సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో నెటిజన్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన అనంతరం బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపణలు వచ్చాయి. బదులుగా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు ఆరోపిస్తూ మహిళపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిసింది.
పోలీసుల ప్రకటన ప్రకారం.. వాహనం రాంగ్ సైడ్ నుంచి రావడంతో తనిఖీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో FIR నెం. 567/2025గా భారతీయ న్యాయ సంహిత-2023 సెక్షన్లు 281, 221, 296(b), 351(1)తో పాటు మోటార్ వాహన చట్టం సెక్షన్లు 177, 184 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మహిళను పాలడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించగా, ఆమె మొదట ఫిర్యాదు చేయలేదని, అనంతరం దరఖాస్తు ఇవ్వడంతో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్టేషన్ డైరీలో నోట్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ (వెస్ట్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, మహిళపై దాడి చేసిన ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు పోలీస్ అధికారిపై తీవ్రంగా మండిపడ్డారు. సస్పెన్షన్ కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్‌లు డిమాండ్ చేశారు. వీడియో ఇదే..






