Viral Video: అంకుల్ ఇదేం పని.. బస్సులో యువతిని అక్కడ చూస్తూ వికృత చేష్టలు! ఘటన వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-09-10 03:55:32  IST  )

రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, పండుగల సమయాల్లో మహిళలు కనిపిస్తే చాలు ఈవ్ టీసింగ్ చేస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.

Viral Video: అంకుల్ ఇదేం పని.. బస్సులో యువతిని అక్కడ చూస్తూ వికృత చేష్టలు! ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు, పండుగల సమయాల్లో మహిళలు కనిపిస్తే చాలు ఈవ్ టీసింగ్ చేస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా కొందరి తీరు మాత్రం మారటం లేదు. ఈ క్రమంలోనే తాజాగా యువతితో ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు అతనిపై మండిపడ్డారు. (Onam Festival) ఓనం పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో ఉన్న కేరళ అమ్మాయి బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. తన పక్క సీట్లో కూర్చుని ఉన్న యువతి ఎదపై వ్యక్తి అసభ్య తీరుగా అక్కడే చూస్తూ ఉండిపోతాడు. ఇది గమనించిన యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో (Viral Video) వైరల్‌గా అయింది.

వీడియోలో చూపిస్తున్న ప్రకారం.. బస్సులో యువతి కేరళ సంప్రదాయ దుస్తుల్లో ఉంటుంది. పక్క సీట్లో కూర్చోని ఉన్న పెద్ద వయసు గల వ్యక్తి కళ్లు ఆర్పకుండా యువతి ఎదపై చూస్తూ ఉండిపోతాడు. ఇది గమనించిన యువతి వెంటనే వీడియో తీసుకుంటుంది. యువతి తన ఫోన్‌లో వీడియో తీస్తోందని వ్యక్తి గమనించకుండా అలాగే అసభ్యంగా చూస్తూనే ఉంటాడు. మధ్యలో ఆ యువతి వ్యక్తి వైపు చూసినప్పుడు తల పక్కకి తిప్పుతాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఆదే యువతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు.

దాదాపు ప్రతి మహిళ ఇలాంటి ఘటనలను ఎదుర్కొంటున్నారని, ఇలా ప్రవర్తించే వారు మనుషులు కాదని రాక్షసులని ఎక్స్ వేదికగా @SaffronSunanda అనే యూజర్ వీడియో పోస్ట్ చేసింది. అంకుల్ ఇదేం పని.. నీ కూతురి వయసున్న అమ్మాయితో వికృత చేష్టలు చేయడం చేయడం ఏమిటి? అని ఓ నెటిజన్ మండిపడ్డారు. చాలా మంది అతనికి తగిన బుద్ధి చెప్పాలని వ్యక్తిని తప్పుబట్టారు. మరోవైపు కొంత మంది నెటిజన్లు యువతిని తప్పుబట్టారు. చీరను సరిగ్గా కట్టుకోవాలని ఆమెకు సలహా కూడా ఇచ్చారు.

Link

Next Story