Video Viral: బస్సులో ప్రయాణం జాగ్రత్త! రోడ్డుపై జారీ పడిన వృద్ధురాలు మృతి.. వీడియో వైరల్

by Ramesh Naini |

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో నుంచి రోడ్డుపై పడి వృద్ధురాలు మృతి చెందారు.

Video Viral: బస్సులో ప్రయాణం జాగ్రత్త! రోడ్డుపై జారీ పడిన వృద్ధురాలు మృతి.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Video Viral) కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌(Thrissur)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో నుంచి రోడ్డుపై పడి వృద్ధురాలు మృతి చెందారు. పూవత్తూర్‌కు చెందిన 74 ఏళ్ల నళిని, ‘జానీస్’ అనే ప్రవేటు బస్సుల్లో ప్రయాణిస్తుండగా నిన్న ఉదయం సంఘటన జరిగింది. నివేదికల ప్రకారం.. పూచక్కును అనే స్టాప్ వద్ద నళిని బస్సు ఎక్కారు. తర్వాత కండక్టర్ వెంటనే డోర్ మూసేశాడు. మొదట డ్రైవర్ వెనుక ఉన్న రాడ్‌ను ఆమె పట్టుకుని నిలబడ్డారు. తన వెనుక ఒక సీటు ఖాళీగా ఉందని తెలియగానే ఆమె అక్కడికి చేరుకోవాలని ట్రై చేశారు. అదే సమయంలో బస్సు మలుపు తీసుకునేటప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. అప్పుడు కండక్టర్ ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ పట్టుకోలేకపోయారు. బస్సు మలుపు తిరగడంతో ఆమె పట్టుకోల్పోయి డోర్‌కు బలంగా ఢీ కొనడంతో వెంటనే బస్సు తలుపు తెరుచుకుని రోడ్డుపై పడిపోయారు. వెంటనే బస్సులో ఉన్న వారు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు.

అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.. కానీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఘటన బస్సు సీసీటీవీ ఫుటేజ్ విడుదల అయింది. దీంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని బస్సు యాజమాన్యంపై నెటిజన్‌లు మండిపడ్డారు. నిలబడిన వారికి పట్టుకోవడానికి రాడ్ (రెయిలింగ్) లేకపోవడం చేత ఆ వృద్ధురాలు పట్టుకోల్పోయి ప్రమాదం సంబవించిందని పలువురు నెటిజన్‌లు అభిప్రాయపడ్డారు. బస్సులో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్‌లు ప్రయాణికులకు సూచించారు.వైరల్ వీడియో లింక్..

Next Story