Jagdeep Dhankhar: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపరాష్ట్రపతి

by Shamantha N |

గతకొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ డిశ్చార్జి అయ్యారు.

Jagdeep Dhankhar: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపరాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గతకొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ డిశ్చార్జి అయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో మార్చి 9న ఎయిమ్స్‎లో చేరిన ధంఖర్.. పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్లు బుధవారం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ చికిత్సకు బాగా స్పందించారు. ఎయిమ్స్‌లోని వైద్య బృందం నుంచి అవసరమైన ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఆయన త్వరితగతిన కోలుకున్నారు’’ అని పేర్కొన్నారు. అలాగే.. కొన్ని రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఆస్పత్రిలో చేరిన ధంఖర్

ఇకపోతే, ఆదివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్ ధంఖర్ ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (CCU)లో చికిత్స అందించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో ట్రీట్మెండ్ జరిగింది. కాగా.. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు, ప్రధాని మోడీకి ముందే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

Next Story