- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ పదాలు చేర్చిన కాంగ్రెస్‌పై వీసీ ధన్కర్ ఆగ్రహం..
రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ పదాలు చేర్చిన కాంగ్రెస్‌పై వీసీ ధన్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఠికలో మార్పులు చేయకూడదన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగ పీఠికపై ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలను దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సమర్థించారు. ఎమర్జెన్సీ సమయంలో ‘సోషలిస్టు, సెక్యులర్, ఇంటిగ్రిటీ (నిజాయితీ)’ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చినందుకు కాంగ్రెస్‌పై ధన్కర్ మండిపడ్డారు. ఈ పదాలు మాయని గాయాలని, దేశ ఉనికికే ఇవి సమస్యలుగా మారాయని చెప్పిన ఆయన.. రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలను దేశం గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ.. పీఠిక రాజ్యాంగానికి ఆత్మ వంటిదని, దానిలో ఎవరూ మార్పులు చేయకూడదని ధన్కర్ చెప్పారు. ‘పీఠికను ఎవరూ మార్చకూడదు. రాజ్యాంగ నిర్మాణానికి అదే ఆధారం. రాజ్యాంగం అనే మహావృక్షం పుట్టడానికి కారణమైన విత్తనం’ అని ధన్కర్ అన్నారు. ఇలాంటి పదాలను రాజ్యంగ పీఠికలో చేర్చడం అంటే వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేశ నాగరిక సంపద, జ్ఞానాన్ని తక్కువ చేయడమేనని, ఇది సనాతన స్ఫూర్తిని అవమానించినట్లేనని ఉపరాష్ట్రపతి అన్నారు.






