- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది జ్యుడీషియల్ చరిత్రలోనే చీకటి నిర్ణయం.. సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి ధన్కర్!
ఎమర్జెన్సీ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి ధన్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తీర్పు ప్రపంచ జ్యుడీషియల్ చరిత్రలోనే చీకటిదని అన్నారు!

దిశ, నేషనల్ బ్యూరో: ఎమర్జెన్సీ సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ప్రపంచ జ్యుడీషియల్ చరిత్రలోనే ‘చీకటి నిర్ణయం’గా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. రాజ్యసభలో ఇంటర్న్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 9 హైకోర్టులు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు నిర్ణయం దేశంలో నిరంకుశత్వానికి, నియంతృత్వానికి చట్టబద్ధత కల్పించిందని ధన్కర్ అన్నారు. అలాగే ప్రధాని ఇందిరా గాంధీ చెప్పగానే ఎమర్జెన్సీ ఉత్తర్వులపై అప్పటి రాష్ట్రపతి ఫఖ్‌రుద్దీన్ అలీ అహ్మద్ సంతకం పెట్టడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.
మంత్రి మండలి కాకుండా కేవలం ప్రధాని అడిగితే ఎలా సంతకం పెడతారని నిలదీశారు. రాష్ట్రపతి ఎప్పుడూ ఒక వ్యక్తి లేదా ప్రధానమంత్రి చెప్పినట్లు నడుచుకోకూడదని, ఈ విషయంలో రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. ‘రాష్ట్రపతికి ఏమైనా సలహాలు, సూచనలు చేయడం కోసం పీఎం నేతృత్వంలో ఉండే మంత్రిమండలి ఉంటుంది. దాన్ని పట్టించుకోకపోవడం ఒక తప్పు. దాని ఫలితం ఏంటి? గంటల వ్యవధిలోనే లక్షలమంది ప్రజలు జైలుపాలయ్యారు’ అని ధన్కర్ పేర్కొన్నారు.






