- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VHP Strike Call : రేపు దేశవ్యాప్త సమ్మెకు VHP పిలుపు
విశ్వ హిందూ పరిషత్(VHP) శనివారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది(Strike Call).

దిశ, వెబ్ డెస్క్ : విశ్వ హిందూ పరిషత్(VHP) శనివారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది(Strike Call). పశ్చిమ బెంగాల్(West Bengal Issue) లో జరిగిన హింసాత్మక ఘటనలను వీహెచ్పీ ఖండించింది. బెంగాల్ లో తక్షణమే రాష్ట్రపతి పాలన(Emergency) విధించాలని డిమాండ్ చేసింది. బెంగాల్ హింసాత్మక ఘటనలను వ్యతిరేకిస్తూ ఆ సంస్థ రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్(Alok Kumar) ఓ ప్రకటన జారీ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని, అన్ని జిల్లాలోని వీహెచ్పీ సభ్యులు, మద్ధతుదారులు విధిగా ఈ ధర్నాలోపాల్గొనాలని ఆయన కోరారు. బెంగాల్ లో వెంటనే ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల మేజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని ఆయన సూచించారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లోని మాల్డా, ముర్షీదాబాద్, హుగ్లీ తదితర ప్రాంతాల్లో నిరసనకారుల ఆందోళనలు.. చివరికి హింసాత్మక అల్లర్లకు దారి తీసాయి. ముర్షీదాబాద్ లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.






