Valentine's Day: పార్కుల్లో ప్రేమికులను పరిగెత్తించిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్

by Ramesh Naini |

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ కార్యకర్తలు శనివారం నిరసనలతో హోరెత్తించారు. నగరంలోని పలు బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ యువతీ యువకులను అక్కడి నుంచి పంపించివేశారు.

Valentines Day: పార్కుల్లో ప్రేమికులను పరిగెత్తించిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వాలెంటైన్స్ డే వేడుకలు భారతీయ సంస్కృతికి విరుద్ధమంటూ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ కార్యకర్తలు శనివారం నిరసనలతో హోరెత్తించారు. నగరంలోని పలు బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ యువతీ యువకులను అక్కడి నుంచి పంపించివేశారు.

పాశ్చాత్య సంస్కృతిపై విమర్శలు..

వాలెంటైన్స్ డే అనేది పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, ఇది మన సనాతన ధర్మానికి, సంప్రదాయాలకు ఏమాత్రం పొంతన లేనిదని ఆందోళనకారులు పేర్కొన్నారు. పార్కుల్లో జంటగా కూర్చున్న యువతీ యువకులకు కౌన్సెలింగ్ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తలు వస్తున్న విషయాన్ని గమనించిన పలువురు ప్రేమికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

పుల్వామా అమరవీరులను స్మరించుకోవాలి

కాగా, ఫిబ్రవరి 14 ను ప్రేమ దినోత్సవంగా కాకుండా, 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం 'అమరవీరుల దినోత్సవం'గా జరుపుకోవాలని వీహెచ్‌పీ నేతలు పిలుపునిచ్చారు.

Next Story