- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రాహుల్ గాంధీ పిటిషన్‌పై తీర్పు.. తీవ్ర ఉత్కంఠ
నేడు రాహుల్ గాంధీ శిక్ష నిలుపుదల పిటిషన్ పై తీర్పు వెలువడనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు రాహుల్ గాంధీ శిక్ష నిలుపుదల పిటిషన్ పై తీర్పు వెలువడనుంది. పరువు నష్టం కేసులో శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ స్టే పిటిషన్ వేయగా..నేడు తీర్పును గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్టు వెలువరించనుంది. అయితే పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షను సూరత్ కోర్టు విధించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఆయన సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. నేడు తుది తీర్పును వెల్లడించనుంది. మధ్యాహ్నం వరకు కోర్టు తీర్పు వెలువడనున్నట్లు తెలిసింది. కోర్టు తీర్పును బట్టి ఆయన భవితవ్యం ఆధారపడి ఉండటంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Next Story






