Nobel Peace Prize: తన నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్‍కు అందజేసిన మచాడో.. అలా ఇవ్వొచ్చా..?

by Prasad Jukanti |   (  Updated:2026-01-16 04:32:04  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతికి ఎట్టకేలకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి చేరింది.

Nobel Peace Prize: తన నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్‍కు అందజేసిన మచాడో.. అలా ఇవ్వొచ్చా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుకున్నది సాధించాడు. ట్రంప్ చాలా కాలంగా నోబెన్ శాంతి బహుమతిపై (Nobel Peace Prize) కన్నేసిన సంగతి తెలిసిందే. గతేడాది తనకే ఈ ప్రైస్ దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నా ఆయనకు నిరాశే మిగిలింది. కానీ తాజాగా ఆయన ఆశ నెరవేరింది. ఎట్టకేలకు ఆయన చేతికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చి చేసింది. 2025 సంవత్సరానికి గాను తాను అందుకున్న నోబెల్ శాంతి బహుమతిని వెనెజులా విపక్ష నేత మారియా కోరినా మచాడో (Maria Corina Machado) ట్రంప్‍కు అందజేశారు. తాజాగా వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ అయిన మచాడో ఈ సందర్భంగా తన నోబెల్ బహుమతిని ట్రంప్ కు అందజేశారు. ఈ విషయంపై స్పందించిన ట్రంప్.. మచాడో ఇచ్చిన నోబెల్ పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. తాను చేసిన సేవలను గుర్తిస్తూ మచాడో నోబెల్ ఇచ్చారని, పరస్పర గౌరవానికి ఇదొక మంచి సంకేతమని ట్రంప్ చెప్పారు. ఈ భేటీ సందర్భంగా వెనిజులా భవిష్యత్తు గురించి ట్రంప్ తో చర్చించానని తమ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ట్రంప్ పై ఆధారపడొచ్చని ఆమె పేర్కొన్నారు. అలాగే కరేబియన్ లో మరో చమురు ట్యాంకర్ ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ట్రంప్ తో ఆమె చర్చించారు. అయితే ఇటీవల అమెరికా దళాలు వెనిజులాలోకి ప్రవేశించి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య మారియా కోరినా మచాడో ట్రంప్‍తో భేటీ కావడం ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

నోబెల్ ఇవ్వడంపై విమర్శలు:

మచాడో తనకు వచ్చిన నోబెల్ బహుమతిని ట్రంప్ కు ఇవ్వడం పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తనకు లభించిన శాంతి బహుమతిని ట్రంప్ కు ఇస్తానని గతంలోనే మచాడో చెప్పడంపై నోబెల్ ఇన్ స్టిట్యూట్ సైతం ఇటీవల స్పందించింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత దానిని రద్దు, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. అయినా మచాడో మాత్రం తనకు ఇచ్చిన పురస్కారాన్ని ట్రంప్‍కు అప్పగించడం చర్చనీయాశంగా మారింది. ఇయితే తనకు వచ్చిన ఆ మెడల్ ను ట్రంప్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వార్త కథనాలు వెలువడుతున్నాయి.

Read More..

భిన్నత్వమే భారత ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష: కామన్వెల్త్ సదస్సులో ప్రధాని మోడీ

Next Story