కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం..

by Ramesh Naini |   (  Updated:2026-05-18 05:10:15  IST  )

కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగిన వేడుకలో కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

కొలువుదీరిన పూర్తిస్థాయి మంత్రివర్గం..

ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు ఒకేసారి పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా కొలువుదీరింది. సీఎంతో కలిపి మొత్తం 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అందరితోనూ దైవసాక్షిగా ప్రమాణం చేయించారు.

తరలివచ్చిన జాతీయ నేతలు, సీఎంలు..

ఈ చారిత్రాత్మక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు భారీగా తరలివచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరై నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై నూతన సీఎం సతీశన్‌కు అభినందనలు తెలిపారు.

Next Story