కేరళలో అరుదైన సీన్..వీడీ సతీశన్ ప్రమాణస్వీకార వేదికపై మాజీ సీఎం

by velandi.Saikiran |

ఇవాళ వీడీ సతీశన్ బాధ్యతలు స్వీకరించగా, ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా హాజరయ్యారు.

కేరళలో అరుదైన సీన్..వీడీ సతీశన్  ప్రమాణస్వీకార వేదికపై మాజీ సీఎం
X

దిశ‌, వెబ్ డెస్క్: కేరళం సీఎం గా వీడీ సతీశన్ కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మొత్తం 20 మంది మంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.

అయితే ఈ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ కేరళం రాజకీయాలలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. కేర‌ళం కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ వీడీ సతీశన్ బాధ్యతలు స్వీకరించగా, ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా వేదికపై కూర్చోవడం అందరిని ఆకట్టుకుంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రత్యర్థి అధికార పీఠం ఎక్కే వేడుకకు ఎలాంటి అసూయ లేకుండా రావడం రాజకీయాల్లో చాలా అరుదు. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది.



Next Story