మేం డీఎంకే కూటమిలోనే కొనసాగుతాం.. వీసీకే సంచలన ప్రకటన

by Ajay Maddhiboyina |

తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గంటగంటకూ పరిణామాలు మారుతూనే ఉన్నాయి. ఫలితాల అనంతరం టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది.

మేం డీఎంకే కూటమిలోనే కొనసాగుతాం.. వీసీకే సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గంటగంటకూ పరిణామాలు మారుతూనే ఉన్నాయి. ఫలితాల అనంతరం టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఇప్పటికే తమ మద్దతు ప్రకటించగా తాజాగా వీసీకే కూడా సస్పెన్స్ కు గుడ్ బై చెబుతూ ఓకే చెప్పింది. కానీ ఈ సందర్భంగా కీలక ప్రకటన కూడా చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతు ఇస్తామని కానీ క్యాబినెట్ బెర్తులు మాత్రం వద్దని చెప్పింది. తాము ప్రభుత్వంలో భాగం అవ్వబోమని, బయట నుండే మద్దతు ఇస్తామని తెలిపింది.

భవిష్యత్‌లో ప్రభుత్వంలో భాగం అవుతామా లేదా అన్నది చెప్పలేమని, ప్రస్తుతం డీఎంకే కూటమిలోనే కొనసాగుతున్నామని స్పష్టం చేసింది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకుండా ఉండేందుకు టీవీకేకు మద్దతు ఇచ్చామని తెలిపింది. ఈ వివరాలను వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియాకు వెల్లడించారు. ఇక ఇప్పటికే వామపక్షాలు సైతం క్యాబినెట్ పదవులు వద్దని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తాము కూడా డీఎంకేతోనే ఉంటామని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బీజేపీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటోందని ఈ నేపథ్యంలోనే తాము టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నామని పేర్కొంది. ఈ పార్టీలతో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సైతం మద్దతు ప్రకటించింది.

Next Story