Prakash Ambedkar : ఛాతీనొప్పితో ప్రకాశ్ అంబేద్కర్‌‌కు అస్వస్థత

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌(Prakash Ambedkar) అస్వస్థతకు గురయ్యారు.

Prakash Ambedkar : ఛాతీనొప్పితో ప్రకాశ్ అంబేద్కర్‌‌కు అస్వస్థత
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌(Prakash Ambedkar) అస్వస్థతకు గురయ్యారు. ఆయన వయసు 70 ఏళ్లు. గురువారం తెల్లవారుజామున ప్రకాశ్ అంబేద్కర్‌‌కు ఛాతీనొప్పి రావడంతో వెంటనే పూణేలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గుండెలో బ్లడ్ క్లాట్ ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కాసేపట్లో వైద్యులు ఆంజియోగ్రఫీ చేయనున్నారు.

ఈవివరాలను ప్రకాశ్ అంబేద్కర్‌‌కు చెందిన రాజకీయ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ (VBA) ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రకాశ్ అంబేద్కర్‌‌ మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంటారని వీబీఏ మహారాష్ట్ర అధ్యక్షుడు రేఖా తాయ్ ఠాకూర్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వీబీఏను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ ఏడాది మార్చి నుంచి ప్రకాశ్ అంబేద్కర్‌‌ విరామం తీసుకోకుండా పర్యటనలు నిర్వహిస్తున్నారు.

Next Story