వందేమాతరంపై లోక్ సభలో చర్చ.. కాంగ్రెస్‍పై మోడీ ఘాటు విమర్శలు

by Prasad Jukanti |   (  Updated:2025-12-08 07:39:41  IST  )

వందేమాతరం ఆజాద్ భారత్ కు విజన్ గా మారిందని ప్రధాని మోడీ అన్నారు.

వందేమాతరంపై లోక్ సభలో చర్చ.. కాంగ్రెస్‍పై మోడీ ఘాటు విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. వందేమాతరం (Vande Mataram) రాజకీయ అధికారం కోసం మాత్రమే ఉద్దేశించిన గీతం కాదని భారత దేశాన్ని బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గీతం అన్నారు. ఇవాళ లోక్ సభలో (Lok Sabha) వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై (Vande Mataram 150 Years) చర్చను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ వందేమాతరం.. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతు అని వందేమాతరం గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వందేమాతర గీతం స్వాతంత్య్ర సమరయోధులకు ఊపిరిగా నిలిచిందని, భారతదేశాన్ని బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గీతం వందేమాతరం అన్నారు. అలాంటి కోట్ల మందికి స్ఫూర్తి నింపిన ఈ గీతంపై చర్చ జరపడం మనందరి అదృష్టం అని, ఈ చర్చలో పాల్గొనడం నాకు గర్వకారణం అన్నారు. బకించంద్ర చటర్జీ రాసిన వందేమాతరం దేశానికి పునరుజ్జీవాన్నిచ్చిందని 'గాడ్ సేవ్ ద క్వీన్' గీతంతో భారత్‍ను బ్రిటీష్ వారు మనల్ని అణచివేశారు. ఈ గాడ్ సేవ్ ద క్వీన్ గీతానికి పోటీగా వందేమాతరం గర్వంగా నిలబడిందన్నారు. జననీ జన్మభూమిశ్చ అన్న రాముడి మాటలకు మరో రూపం వందేమాతరం అన్నారు.

కాంగ్రెస్ పై ఫైర్:
ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ వందేమాతరంపై కాంప్రమైజ్ అయిందని ముస్లిం లీగ్ ముందు కాంగ్రెస్ లొంగిపోయిందని ధ్వజమెత్తారు. సామాజిక సామరస్యం పేరుతో జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరాన్ని ముక్కలు ముక్కలు చేశారని, కాంగ్రెస్ ఇప్పటికీ వందేమాతరాన్ని అవమానిస్తోందని ఆరోపించారు. వందేమాతరానికి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.

ఈ చర్చ చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్లముందుకు తీసుకొస్తుందని ఇవాళ్టి చర్చలు భవిష్యత్ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా వేడుకలు జరుపుకొంటున్నామన్నారు. వందేమాతరం అనేది ఒక మంత్రం అన్నారు. 1947 లో దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతో తోడ్పడిందని 2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందేమాతరం స్ఫూర్తి అవసరం అన్నారు. గంగా, సింధూ, గోదావరి, కావేరి నదుల వెంట ఉన్న సాంస్కృతిక వైభవాన్ని వందేమాతరం చాటిచెప్పిందన్నారు. భారత్ ను విడదీస్తే గానీ ఇక్కడ పాలించలేమని బ్రిటిషన్లు భావించారు. దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రలు చేసి దానికి బెంగాల్ ను ఓ ప్రయోగ శాలగా మార్చారన్నారు. అనుకున్నట్టుగానే బెంగాల్ ను విభజిచారు. ఈ విభజన జరిగినా దేశం మొత్తం వందేమాతరం స్ఫూర్తితో కలిసికట్టుగా పోరాడిందన్నారు. అనేక మంది ప్రాణాలు పోతున్నా వందేమాతర నినాదాన్ని ఆపలేదన్నారు. వందేమాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వందేమాతరం ఆజాద్ భారత్ కు విజన్ గా మారిందని ఆ తర్వాత స్వదేశీ నినాదానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు.

Next Story